: 'చిన్నారి పెళ్లికూతురు' ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య
దేశవ్యాప్తంగా ఎంతో మందిని అలరించిన 'బాలికావధు' సీరియల్ లో నటించిన ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సీరియల్ 'చిన్నారి పెళ్లి కూతురు' పేరిట తెలుగులోకి కూడా అనువాదమైంది. అలాగే, 'బిగ్ బాస్ షో' ద్వారా కూడా ఆమె ప్రేక్షకాదరణ పొందింది. ఈ రోజు ముంబైలోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చూసిన స్థానికులు హుటాహుటీన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 'బాలికావధు' సీరియల్ లో అవికాగోర్ స్థానంలో ప్రత్యూష నటించింది. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.