: నాకసలు సిగ్గంటే ఏమిటో తెలియదు!: పోసాని కృష్ణమురళి
తనకసలు సిగ్గేలేదని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తనకు సిగ్గంటే తెలియదని అన్నారు. మొండిమొలతో పరిగెత్తమన్నా సిగ్గులేకుండా పరుగెడతానని చెప్పారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయడంపై మాట్లాడుతూ, 'నేను పోసాని కృష్ణమురళిని, నేను కమ్మోడిని, నన్ను చిరంజీవి పంపించాడు గెలిపించండి' అని ప్రజలను అడిగానని చెప్పారు. గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా, అంతే కానీ డబ్బులు ఖర్చుపెట్టను అని ప్రజలకు చెప్పాను. అది వారికి నచ్చలేదు. అందుకే ఓడించారని పోసాని తెలిపారు. అయినప్పటికీ తాను సొంతంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని అన్నారు. అయితే, రాజకీయాలు తనకు నప్పవని ఆ తరువాత అర్థమైందని పోసాని కృష్ణమురళి చెప్పారు. తనకు ఈ మధ్యవయసులో సినీ పరిశ్రమలో బ్రేక్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పోసాని చెప్పారు.