: ఆశ్చర్యకరమైన సెల్ఫీ... ఒకే వ్యక్తికి రెండు ముఖాలు!
ఒక జంట దిగిన సెల్ఫీ చాలా ఆశ్చర్యంగానే కాదు, నిశితంగా పరిశీలిస్తే భయం పుట్టించే విధంగా కూడా ఉంది. ఈ సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అంతగా ఆశ్చర్యం కల్గిస్తున్న ఆ సెల్ఫీలో ఏముందంటే...గ్లాస్ విండో వద్ద ఆ జంట సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీలో వారిద్దరు చక్కగా కనపడుతుంటారు. అయితే, సెల్ఫీ దిగేటప్పుడు వారి వెనుక గ్లాస్ విండో కారణంగా రిఫ్లెక్ట్ అయిన ఇమేజ్ కూడా వచ్చింది. ఆ ఇమేజే లో అమ్మాయి తల వెనుక భాగంలో కూడా ఆమె ముఖమే కనపడుతోంది. చూసే వారికి రెండు ముఖాలున్నట్లుగా కనపడుతోంది. ఇదెలా సాధ్యమంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే, ఇది ఫోటో షాప్ మాయాజాలం అంటూ కొట్టిపారేస్తున్నారు.