: రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వబోను: కేజ్రీవాల్
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను పునరావృతం కానివ్వబోనని వ్యాఖ్యానించారు. ఆ రెండు రాష్ట్రాల చట్టప్రతినిధులు ఏం చెబుతున్నారో ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా వినాలని, ప్రజల అవసరాల మేరకే ప్రతిపక్షాల డిమాండ్లు ఉండాలని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ వచ్చే రెండేళ్లలో ఏ ఎన్నికలలోనూ విజయం సాధించలేదనే ఉద్దేశంతోనే.. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచి రాష్ట్రపతి పాలన విధిస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ.. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ల తరువాత హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను అస్థిరపరిచే కార్యక్రమం చేపట్టనున్నదని ఆయన అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితిని మాత్రం రానివ్వబోమని స్పష్టం చేశారు.