: పంజాబ్ నూ 'ఆప్' ఊడ్చేయనుందట!... అధికారం కేజ్రీదేనంటున్న ‘సీఓటర్’ సర్వే


దేశ రాజధాని ఢిల్లీలో అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీని మట్టికరపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా పంజాబ్ లోనూ సత్తా చాటనుందట. త్వరలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రస్తుత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ లకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భారీ షాకివ్వనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం విడుదలైన ‘హఫ్ పోస్ట్-సీఓటర్’ సర్వే సంచలన గణాంకాలను వెల్లడించింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 117. వీటిలో 94 సీట్ల నుంచి 100 సీట్లలో ఆప్ జెండా ఎగరనుందట. ఇదే నిజమైతే, ఇక పంజాబ్ లోనూ కాంగ్రెస్, అకాలీదళ్ లకు నూకలు చెల్లినట్లే. ఇక సీఎంగా ఎవరైతే మంచిదని ప్రశ్నించిన ఆ సర్వే సంస్థ ప్రతినిధుల చెవుల్లో అరవింద్ కేజ్రీవాల్ పేరు మారుమోగిపోయిందట. పంజాబ్ ఓటర్లలో ఏకంగా 59 శాతం మంది కేజ్రీ పాలనకే మొగ్గుచూపారు. ఈ సర్వే అంచనాలే నిజమైతే... ఆప్ చేతికి మరో రాష్ట్రం చిక్కినట్లే.

  • Loading...

More Telugu News