: పాదచారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు... హైదరాబాదులో వ్యక్తి దుర్మరణం


హాఫ్ డే స్కూల్ ముగిసిన తర్వాత చిన్న పిల్లలను వారి ఇళ్ల వద్ద దించేందుకు బయలుదేరిన ఓ స్కూల్ బస్సు మార్గమధ్యంలోనే అదుపు తప్పింది. రోడ్డుపై వేగంగా వెళుతున్న క్రమంలో అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదంతో బస్సులో ఉన్న చిన్నారులు బెంబేలెత్తిపోయారు. వేగంగా స్పందించిన స్థానికులు బస్సులోని పిల్లలను సురక్షితంగా కిందకు దించారు. హైదరాబాదులోని విద్యానగర్ లో కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రమేశ్ అనే వ్యక్తి చనిపోగా, బస్సు దిగి పరారవుతున్న డ్రైవర్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News