: జ్యోతుల నెహ్రూ ఈ నెల 11న టీడీపీలో చేరుతున్నారు: యనమల


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తమ పార్టీలో ఏ తేదీన చేరతారనే విషయాన్ని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని అన్నారు. విజయవాడలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరతారని చెప్పారు. కాగా, ఈ నెల 8వ తేదీన చంద్రబాబు సమక్షంలో వరుపుల సుబ్బారావు కూడా టీడీపీలో చేరతారని యనమల పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ అధినేత తీరుపై అసహనంగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు వరుసగా జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News