: భారత్-పాక్ మ్యాచ్ పై రూ.2,500 కోట్ల బెట్టింగ్!... దావూద్ ఇబ్రహీం సంచలన వ్యాఖ్య
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో హైవోల్టేజీ మ్యాచ్ ఏదైనా ఉందంటే... అది గత నెల 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచే. ఇరు దేశాల్లోని క్రికెట్ లవర్సే కాక విశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఇదే చెబుతారు. మరి ఈ మ్యాచ్ పై బెట్టింగ్ ఎంతమేర జరిగిందనే విషయం తెలియాలంటే... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సంప్రదించాల్సిందే. ఎందుకంటే, బెట్టింగ్ మొత్తం అతడి కనుసన్నల్లోనే జరుగుతుంది కాబట్టి. దావూద్ ఇబ్రహీం వ్యాఖ్యాలను కోట్ చేస్తూ నేషనల్ మీడియా నిన్న ఓ సంచలన వార్తను ప్రచురించింది. సదరు వార్తలో సెమీ ఫైనల్ లో ధోనీ సేనదే విజయమని చెప్పిన దావూద్... బెట్టింగ్ పైనా నోరు విప్పాడు. టోర్నీకే హైలైట్ గా నిలిచిన భారత్-పాక్ మ్యాచ్ పై రూ.2,500 కోట్ల మేర బెట్టింగ్ జరిగిందని దావూద్ చెప్పాడు. ఇక నిన్నటి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై ఏకంగా రూ.4,000 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశాలున్నట్లు అతడు చెప్పాడు.