: నేను రిటైర్ కావాలా?... ఫిట్ గా లేనా?: విదేశీ జర్నలిస్టుకు ధోనీ ఎదురు ప్రశ్న


నిన్నటి ఓటమితో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఔట్ అయిపోయింది. బ్యాట్స్ మెన్ సత్తా చాటినా, బౌలర్లు చేసిన చిన్న తప్పిదాలకు యావత్తు జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ధోనీ సేన, రిక్త హస్తాలతోనే వెనుదిరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... తన రిటైర్మెంట్ ఎఫ్పుడంటూ ప్రశ్నించిన ఓ విదేశీ జర్నలిస్టు పట్ల ఆసక్తికరంగా స్పందించాడు. మీ రిటైర్మెంట్ ఎప్పుడంటూ ప్రశ్నించిన సదరు విలేకరిని తన దగ్గరకు పిలుచుకున్న ధోనీ, తన పక్కనే అతడిని కూర్చోబెట్టుకుని ‘‘నేను రిటైర్ కావాలా?’’ అని ఎదురు ప్రశ్నించాడు. ‘నేను 2019 వరల్డ్ కప్ దాకా ఆడగలనో? లేదో? నువ్వే చెప్పు. నేను ఫిట్ గా లేనా?’’ అని ఆ విలేకరికి మహీ ప్రశ్నల వర్షం కురిపించాడు. చివరకు సదరు విలేకరి... ధోనీని ఫిట్ గా ఉన్న క్రికెటర్ గానే ఒప్పుకోక తప్పలేదు. అలా ఆ విలేకరి నోట తాను ఫిట్ గానే ఉన్నానని ధోనీ చెప్పించేశాడు.

  • Loading...

More Telugu News