: అశ్విన్, పాండ్య నోబాల్స్ టీమిండియా ఓటమికి బీజం వేశాయా?
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఏడవ ఓవర్లో చార్ల్స్ కు ఇచ్చిన జీవదానం, హార్డిక్ పాండ్య 14వ ఓవర్లో లెండిల్ సిమ్మన్స్ కు వేసిన నోబాల్స్ వెస్టిండీస్ ను విజయం దిశగా నడిపించాయి. చార్ల్స్ భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ సంధించిన బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని అద్భుతంగా అందుకున్న బుమ్రా, చార్ల్స్ అవుట్ అని భావించాడు. అయితే థర్డ్ అంపైర్ దానిని నోబాల్ గా గుర్తించి నాటౌట్ గా ప్రకటించాడు. దాంతో చార్ల్స్ బతికిపోయాడు. తరువాత 14వ ఓవర్లో హార్డిక్ పాండ్య వేసిన బంతిని లెండిల్ సిమ్మన్స్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. దీనిని అశ్విన్ ఒడిసి పట్టాడు. అంతా అవుట్ అని భావించారు. థర్డ్ అంపైర్ నోబాల్ గా దీనిని ప్రకటించడంతో అది నాటౌట్ అయింది. చివరిగా 18వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని జడేజా బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టుకున్నాడు. కానీ, చివర్లో కాలు బౌండరీ లైన్ ను తాకడంతో అది సిక్సర్ గా మారింది. ఈ మూడు నాటౌట్లు టీమిండియాకు భారంగా పరిణమించడమే కాకుండా, భారత్ ఓటమికి బీజం వేశాయి.