: బంతి అందుకున్న కోహ్లీ...తొలి బంతికే వికెట్!


టీమిండియా కెప్టెన్ పెద్ద సాహసమే చేశాడు. క్రీజులో కుదురుకుపోయి భారీ షాట్లతో విరుచుకుపడుతున్న చార్ల్స్ (52), లెండిల్ సిమ్మన్స్ (47)కు అడ్డుకట్ట వేసేందుకు నెహ్రా, బుమ్రా, పాండ్య, అశ్విన్, జడేజా అందర్నీ ధోనీ ప్రయోగించాడు. ఎవరూ వారిపై ప్రభావం చూపకపోవడంతో ధోనీ ఎవరూ ఊహించని విధింగా కోహ్లీకి బంతిని అప్పగించాడు. అంతే, కోహ్లీ వస్తూనే గుడ్ లెంగ్త్ బంతిని ఇన్ సైడ్ స్పిన్ చేశాడు. దానిని ఛార్ట్స్ ఆఫ్ సైడ్ సిక్సర్ గా మలచాలని ప్రయత్నించి లాంగ్ ఆఫ్ లో రోహిత్ శర్మకు దొరికిపోయాడు. దీంతో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లీ పరుగులు నియంత్రిస్తే, హార్డిక్ పాండ్య ధారాళంగా పరుగులు సమర్పించాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి విండీస్ మూడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News