: బాహుబలిని చంపాల్సిందిగా నేనే చెప్పా.. అందుకే చంపేశాడు!: 'సీక్రెట్' చెప్పిన రాజమౌళి


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా? దీనికి సమాధానం తెలుసుకోవాలని భావించని తెలుగు సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. దీనికి ఆ సినిమా దర్శకుడు రాజమౌళి సమాధానం చెప్పాడు. 'బాహుబలి'కి జాతీయ ఉత్తమ సినిమా అవార్డు లభించిన సందర్భంగా ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి మాట్లాడుతూ, బాహుబలిని చంపాల్సిందిగా తానే చెప్పానని, అందుకే కట్టప్ప బాహుబలిని ఈటెతో పొడిచాడని అన్నాడు. దీంతో అంతా నవ్వేశారు. ఆ తరువాత సినిమా వచ్చేవరకు ఎదురు చూస్తే సమాధానం తెలుస్తుందని రాజమౌళి తెలిపాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' కోసం పడ్డ కష్టాన్ని పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News