: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్...భారత్ బ్యాటింగ్


వాంఖడే స్టేడియం వేదికగా ఆడనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా, కీలకమైన ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ను పక్కనపెట్టిన ధోనీ అతని స్థానంలో అజింక్యా రహానేను జట్టులోకి తీసుకున్నాడు. గాయపడిన యువరాజ్ సింగ్ స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చాడు. కాగా, రహానే, రోహిత్ లకు వాంఖడే స్టేడియం హోం గ్రౌండ్ కావడం విశేషం. వీరిద్దరూ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని ధోనీ భావిస్తున్నాడు. కాసేపట్లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News