: మోదీ మేనియా కొంచమైనా తగ్గలేదు.. గుజరాత్లో 'ఐ లవ్ మోదీ'
గుజరాత్ మార్కెట్లో 'నమో జాకట్ల' హవా ఎంతగా కొనసాగిందో తెలిసిందే. అయితే మోదీ మేనియా ఇప్పటికీ కొంచం కూడా తగ్గలేదు. అదే క్రేజ్ కొనసాగుతోంది. ఇప్పుడు 'ఐ లవ్ మోదీ'తో వచ్చిన పెన్నులతో గుజరాత్ మార్కెట్లలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. అసలే ఇది విద్యార్థులకు పరీక్షల సమయం. పరీక్షలకు హాజరయ్యే టెన్త్ నుంచి 12 స్టాండర్డ్ విద్యార్థులు ఇప్పుడు నమో పెన్నులపై విపరీతమైన మక్కువ చూపుతున్నారు. 'ఐ లవ్ మోదీ' అన్న నినాదం ఉన్న పెన్నుల్నే కొంటున్నారు. గుజరాత్ లో వీటికి విపరీతమైన గిరాకీ ఉందని వ్యాపారులు చెప్తున్నారు. ఈ పెన్నులను కాషాయ రంగు కవర్ లో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ పెన్నులపై మోదీ బొమ్మతో పాటు కమలం బొమ్మ కూడా ఉంది.