: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్: ఫైనల్‌కు దూసుకెళ్లిన వెస్టిండీస్ జట్టు
టీ20 ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో వెస్టిండిస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ మహిళల జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 137పరుగులు చేసింది. దీంతో 6పరుగుల తేడాతో గెలుపొందిన వెస్టిండిస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో తలపడనుంది.