: జగన్, పవన్ కళ్యాణ్ ని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం: కాంగ్రెస్ నేత చింతా మోహన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ తనదైన శైలిలో మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి పటిష్ట నాయకత్వం అవసరమని, అందుకే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.