: ‘తలసాని’ ప్రెస్ మీట్ తో అబద్ధం నిజం కాదు: ఎంపీ కొత్తపల్లి గీత


హైదరాబాద్ లో భూవివాదానికి సంబంధించి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారని, ఆ అరగంట ప్రెస్ మీట్ తో అబద్ధం నిజం అయిపోదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తన భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ వ్యవహారంలో డ్రామాలు ఆడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. మాట్లాడటానికని చెప్పి తన భర్తను తీసుకువెళ్లిన వారు, ఆయన ఫోన్ ఎందుకు లాక్కున్నారని, ఎందుకు నిర్బంధించారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని గీత అన్నారు.

  • Loading...

More Telugu News