: అసెంబ్లీలో ఏకధాటిగా మూడు గంటలు ప్రసంగం...సీఎం కేసీఆర్ రికార్డు
తెలంగాణ అసెంబ్లీలో వరుసగా మూడు గంటల పాటు ఏకధాటిగా మాట్లాడిన సీఎం కేసీఆర్ రికార్డు నెలకొల్పారు. తెలంగాణ జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించిన ఆయన మూడు గంటలపాటు ప్రసంగిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉదయం 11.45 గంటల సమయంలో ప్రారంభమైన ఆయన ప్రసంగం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ముగిసింది. కాగా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంటే ముందు, సాగునీటి ప్రాజెక్టులపై సుమారు అర్ధగంటపాటు ఆయన మాట్లాడారు. మూడు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సభ్యులకు కేసీఆర్ వివరించారు.