: కోల్కతాలో కూలిన ఫ్లైఓవర్, శిథిలాల కింద చిక్కుకున్న 150 మంది
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో 10 మంది దుర్మరణం చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. శిథిలాల కింద సుమారు 150 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు.