: బీజేపీ హయాంలోనూ నిజాయతీ అధికారికి దక్కని పోస్టింగ్!... 3 నెలలుగా వెయిటింగ్ లోనే ఖేమ్కా


కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అధికారంలో ఉండగానే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాన్ని వెలికి తీసిన సీనియర్ ఐఏఎస్ అధికారిక అశోక్ ఖేమ్కాకు... బీజేపీ సర్కారు గద్దెనెక్కినా న్యాయం దక్కలేదు. ఇప్పటికే 22 ఏళ్ల సర్వీసులో 46 సార్లు బదిలీ అయిన అశోక్ ఖేమ్కాకు మంచి పదవి అప్పగించనున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. ప్రధానమంత్రిత్వ కార్యాలయం నుంచి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని, మళ్లీ ఖేమ్కా తన సొంత కేడర్ అయిన హర్యానాకే వెళ్లిపోవాల్సి వచ్చింది. మూడు నెలల క్రితం ఆయనకు ముఖ్య కార్యదర్శి హోదా ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్వులైతే జారీ అయ్యాయి, కానీ అప్ గ్రేడేడ్ పోస్టు మాత్రం ఆయనకు దక్కలేదు. దీనిపై నిన్న ఖేమ్కా తన ట్విట్టర్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ దక్కినా, మూడు నెలలుగా తక్కువ హోదా కలిగిన పోస్టులోనే కొనసాగిస్తున్న ప్రభుత్వం తనను అవమానపరుస్తోందని, తన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక లెఫ్ట్ నెంట్ జనరల్ స్థాయి అధికారి బ్రిగేడియర్ స్థాయి పదవిలో ఉన్నట్టుగా వుందని ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు.

  • Loading...

More Telugu News