: ప్రధానికి కేసీఆర్ లేఖాస్త్రం


బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయమై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. బయ్యారం ఉక్కును విశాఖ కర్మాగారానికి కేటాయించడంపై టీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరిట తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కేంద్రం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని సూచనప్రాయంగా తెలిపింది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య ఈ వ్యవహారంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం ఉక్కు కర్మాగారానికి మొగ్గు చూపుతుండగా, పీసీసీ చీఫ్ బొత్స అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం సాంకేతికంగా సాధ్యపడదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News