: జనావాసాలపై విరుచుకుపడ్డ మృగరాజు
పార్క్‌లో ఉండాల్సిన ఓ సింహం జనావాసాల్లో కనిపించింది. స్థానికులపై ఆ మృగరాజు విరుచుకుపడింది. గర్జిస్తూ మనుషులపైకి దూకింది. చివరకు చనిపోయింది. వివరాల్లోకెళితే.. కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్ నుంచి ఓ సింహం తప్పించుకుంది. ఆపై పార్క్‌కు పక్కనే ఉన్న జనావాసాల వైపుకి వెళ్లింది. అక్కడి మనుషులపై విరుచుకుపడుతూ పలువురిపై పంజా విసిరింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దాన్ని బంధించాలన్న ప్రయత్నాలు పూర్తిగా విఫలం కావడంతో.. చివరికి అటవీ శాఖ అధికారులు దాన్ని కాల్చి చంపేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.