: ప్రపంచంలోనే తొలి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిజాంసాగర్: సీఎం కేసీఆర్


ప్రపంచంలోనే తొలి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై టీ- అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జలవిధానం, ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పన గురించి వివరించారు. 75 వేలకు పైగా చెరువులని కాకతీయులు నిర్మించారని, కులీకుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మించారని, కాకతీయులు, రెడ్డిరాజుల స్ఫూర్తిని కులీకుతుబ్ షా కొనసాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 11 లక్షల ఎకరాల సాగుభూమి ఉందని, అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుని ముందుకుపోని ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతుల్లో మరికొన్ని ప్రాజెక్టులు ఇరుక్కుపోయాయన్నారు. రాష్ట్రానికి గోదావరి నుంచి 954 టీఎంసీలు, కృష్ణా నుంచి 299 టీఎంసీల నికర జలాలు రావలసి ఉందని, 77 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News