: ఈ-గవర్నెన్స్ లో తెలంగాణదే అందె వేసిన చేయి!... ‘ఎం-వ్యాలెట్’ ను ఆవిష్కరించిన కేటీఆర్


ఈ-గవర్నెన్స్ లో తెలంగాణ సర్కారు దూసుకెళుతోంది. టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారకరామారావు ఐటీ శాఖ మంత్రి హోదాలో ఈ దిశగా ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఐటీ రంగంలో ఇప్పటికే పలు కీలక విజయాలు సాధించిన ప్రభుత్వం... తాజాగా నిన్న ‘ఎం-వ్యాలెట్’ను ఆవిష్కరించింది. ఐటీ శాఖ మంత్రి హోదాలో కేటీఆరే ఈ సరికొత్త యాప్ ను ఆవిష్కరించారు. పూర్తిగా రవాణా శాఖకు చెందిన ఈ యాప్ లో ఒక్కసారిగా మనం ఎంటరైతే చాలు... మన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లు మన మొబైల్ లో ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత లైసెన్స్, ఆర్సీలను వెంటబెట్టుకుని తిరగాల్సిన పనిలేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బండిని ఆపితే... పర్సు బదులు మొబైల్ తీస్తే సరిపోతుంది. మొబైల్ లో ఆర్సీ, లైసెన్స్ లను చూసే ట్రాఫిక్ పోలీసులు మనకు రైట్ చెప్పేస్తారు. పర్సు మరిచిపోయినా, మొబైల్ మరిచిపోని ప్రస్తుత తరుణంలో ఈ ‘ఎం-వ్యాలెట్’ వాహనదారులను ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ లున్న మొబైల్ ఫోన్లలో ‘ఎం-వ్యాలెట్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ తరహాలో ‘ఎంవ్యాలెట్’ యాప్ ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది.

  • Loading...

More Telugu News