: బీహార్ చరిత్రలో ఈ రోజు చారిత్రాత్మకం: నితీష్ కుమార్
బీహార్ చరిత్రలో నేడు చారిత్రాత్మకమైన దినమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో సభ్యులంతా మద్య నిషేధంపై ప్రతిజ్ఞ చేశారని చెప్పారు. మద్యం తాగం, తాగనివ్వమంటూ శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేయడం చారిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు బీహార్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. అయితే ఎన్నికల తరువాత మద్యనిషేధంపై భిన్న వాదనలు వినిపించడంతో ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే నెమ్మదిగా మద్యనిషేధం అమలు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.