: సంప్రదాయం కాదంటే మేము హాజరవ్వం: తెలంగాణ స్పీకర్ కు కాంగ్రెస్ లేఖ
శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా సభలో ఏర్పాటు చేయనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు తాము హాజరు కాబోమని టీ కాంగ్రెస్ నేతలు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా సీఎం శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేపట్టడాన్ని సీఎల్పీ ప్రశ్నించింది. శాసనసభ కమిటీ హాల్, లేదా మరోచోట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే హాజరవుతామని సీఎల్పీ స్పష్టం చేసింది. శాసనసభలో ఏదైనా అంశంపై చర్చ చేపడితే సాఫ్ట్ కాపీని రెండు రోజుల ముందే అంజేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం అలా చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.