: నా ఆరాధ్య దేవత ఐశ్వర్యారాయ్: సంజయ్ లీలా బన్సాలీ


ప్రేమ కథలను భారీతనంతో అద్భుతంగా తెరకెక్కిస్తాడని పేరున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ పై ప్రత్యేక అభిమానం చాటాడు. బాలీవుడ్ లో ఎంత మంది అందగత్తెలతో పని చేసినా ఐశ్వర్యారాయే తన ఆరాధ్య దేవత అని చెప్పాడు. 'బాజీరావ్ మస్తానీ' సినిమాకు అవార్డుల పంట పండడంతో బీటౌన్ సెలబ్రిటీలకు ఈ ఫిలిం మేకర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో పాల్గొన్న వారంతా భన్సాలీని పొగుడుతూ, శుభాకాంక్షలు చెప్పారట. ఎంత మంది శుభాకాంక్షలు చెప్పినా పొంగిపోని భన్సాలీ ఐశ్వర్య పొగిడేసరికి తెగ పొంగిపోయాడట. కాగా, సంజయ్ లీలా భన్సాలీ గతంలో ఐశ్వర్యారాయ్ తో 'దేవదాస్', 'గుజారిష్' సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News