: ఢిల్లీలో కాల్పుల అల‌జ‌డి.. దుండ‌గుల ప‌రారీ


ఢిల్లీలోని ద్వారకా కోర్టు బయట గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే ఇద్దరిపై కాల్పులు జ‌రిపి ప‌రారైన సంఘ‌ట‌న అల‌జ‌డి సృష్టిస్తోంది. కాల్పుల‌తో ఆ ప్రాంతంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కోర్టు ఎదుట ఉన్న అంకిత్‌ దగార్ అనే వ్య‌క్తితో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జ‌రిపారు. దీంతో వీరిరువురికి గాయాలయ్యాయి. భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యేలోపే దుండగులు అక్క‌డినుంచి పారిపోయారు. ఓ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అంకిత్‌ విచారణ నిమిత్తం న్యాయస్థానానికి వచ్చాడు. గాయపడిన మరో వ్యక్తిని ఇంకో కేసులో సాక్షిగా పోలీసులు తెలిపారు. సాక్షిని చంపేందుకే దుండుగులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News