: కాసేపట్లో కీలక పోరుకు కివీస్, ఇంగ్లిష్ జట్లు సిధ్ధం


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. టీ20 వరల్డ్ కప్ అంతిమదశకు చేరుకుంది. క్వాలిఫయర్స్ తరువాత సూపర్ టెన్ ఆసక్తికరంగా సాగింది. న్యూజిలాండ్ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి సెమీఫైనల్ కు చేరగా, తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ జట్టు తరువాత ధాటిగా ఆడి ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. గ్రూప్ ఏ లో టాపర్ గా నిలిచిన న్యూజిలాండ్ తో గ్రూప్ బీలో ద్వితీయ స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ నేడు తలపడనుంది. న్యూజిలాండ్ ఎప్పట్లా ఇంగ్లండ్ పై విరుచుకుపడి టైటిల్ సాధించేందుకు అందివచ్చిన అద్భుత అవకాశాన్ని జారవిడుచుకోకూడదని భావిస్తోంది. ఇదే సమయంలో కీలక సమయంలో పుంజుకున్న ఇంగ్లండ్ 2010 తరువాత టైటిల్ సాధించేందుకు ఇదే సరైన సమయం అని అభిప్రాయపడుతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని భావిస్తోంది. కివీస్ ఓపెనర్లకు ముకుతాడు వేస్తే సగం విజయం సాధించవచ్చన్న ఆలోచనలో ఇంగ్లండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ప్రారంభం కానున్న సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తి రేకెత్తిచడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లు భారీ స్కోర్లతో చెలరేగుతుండడంతో ఈ మ్యాచ్ లో స్కోరు బోర్డుపై భారీ ఎత్తున పరుగులు పారనున్నాయని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News