: ఫిర్యాదుల పర్వం!... చంద్రబాబుతో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ భేటీ


కర్నూలు జిల్లాలో టీడీపీ నేత తులసిరెడ్డిపై మొన్న జరిగిన హత్యాయత్నం ఆ జిల్లా రాజకీయాల్లో పెను కలకలానికే దారి తీసింది. దాడికి పాల్పడింది భూమా నాగిరెడ్డి అనుచరులేనని, ఈ దాడి వెనుక భూమా హస్తం కూడా ఉందని సొంత పార్టీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి నిన్న చంద్రబాబుతో భేటీ అయిన శిల్పా... భూమాపై ఫిర్యాదు చేశారు. తులసిరెడ్డిపై దాడితో తనకు ఏమాత్రం సంబంధం లేదని నిన్ననే ప్రకటించిన భూమా నాగిరెడ్డి... తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి అసెంబ్లీకి వచ్చిన భూమా...చంద్రబాబుతో భేటీ అయ్యారు. నిన్న భూమాపై శిల్పా ఫిర్యాదు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News