: చంద్రబాబు కొట్టారని ఆరోపించిన పోచారంపై రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిల ఆగ్రహం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం తనను కొట్టారంటూ పాత ఘటనలను గుర్తు చేసిన టీఆర్ఎస్ నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం వ్యాఖ్యలపై వెనువెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి... భవిష్యత్తులో కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా ఆయన చెబుతారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అందుకున్న జీవన్ రెడ్డి... చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా టీడీపీలోనే ఎలా కొనసాగారని మంత్రిని నిలదీశారు. పోచారం సంచలన ఆరోపణలు, వాటిపై విపక్ష నేతల ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News