: రాహుల్ గాంధీ నోట 'ప్రపంచ రికార్డు' మాట


కర్ణాటక ఎన్నికల రాజకీయం వేడెక్కింది. బీజేపీకి అక్కడ చుక్కెదురు కావడం తథ్యమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రత్యర్థులపై మాటల దాడుల్లో తీవ్రత పెంచారు. అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అవినీతి విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించిందని ఆరోపించారు. కేంద్రంలో అవినీతి గురించి మాట్లాడే బీజేపీకి కర్ణాటకలో అవినీతి కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికలు మే 5న జరగనున్న నేపథ్యంలో రాహుల్ ప్రస్తుతం రెండో అంచె ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఓ సభలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక బీజేపీ నాయకులు డబ్బుకోసం కలహించుకుంటూ, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారని వ్యాఖ్యానించారు. 'మీకు ఇలాంటి ప్రభుత్వం కావాలా?' అని ప్రజలను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలించిందంటే, అది 'బళ్ళారి బ్రదర్స్' గాలి జనార్థనరెడ్డి, కరుణాకర్ రెడ్డి చలవేనని వ్యాఖ్యానించారు. ఇది 'బళ్లారి' ప్రభుత్వమే గానీ, బీజేపీ ప్రభుత్వం కాదని రాహుల్ విమర్శించారు.

  • Loading...

More Telugu News