: 'జై మాతాకీ', 'జై భార‌త్' అని నిన‌దించ‌క‌పోతే చంపేస్తామంటూ చావ‌బాదారు: మ‌ద‌ర్సా విద్యార్థులు


'జై మాతా కీ' అని నిన‌దించాలని బలవంతం చేస్తూ, త‌మ‌ను కొందరు దుండగులు చంప‌డానికి ప్ర‌య‌త్నించారంటూ ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ముగ్గురు మ‌ద‌ర్సా విద్యార్థులు ఆరోపించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఫైజ్-ఉల్-ఉలూమ్ గౌసియా మదర్సా విద్యార్థి ముహ‌మ్మ‌ద్‌ దిల్కాష్ (18)త‌న మిత్రుల‌తో సమీపంలో ఉన్న బాన్స్ వాలా పార్క్ కి వెళ్లాడు. అక్కడ వీరి టోపీలను చూసిన కొందరు దుండగులు 'జై మాతా కీ', ' జై భార‌త్' అనాలని పట్టుబట్టారు. దిల్కాష్, అతని స్నేహితులు నిరాకరించడంతో దాడికి దిగారు. దీంతో దిల్కాష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడు దిల్కాష్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దాడికి పాల్ప‌డ్డ‌ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంఘటన మార్చి 26న జ‌రిగింద‌ని, కానీ పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేశారని దిల్కాష్ మీడియాకు తెలిపాడు. గాయప‌డ్డ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News