: ఉగ్రదాడిపై పాక్ దర్యాప్తుపై ట్విట్టర్లో ఫన్నీ కార్టూన్ షేర్ చేసిన కేజ్రీ
ఈ ఏడాది జనవరి 2న జరిగిన పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రదాడి ఉదంతంపై ఐదుగురు సభ్యుల పాకిస్థాన్ బృందం ఘటనాస్థలిలో దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ఫన్నీ కార్టూన్ షేర్ చేశారు. 'తమ శిక్షణ కార్యక్రమాలను మరింత మెరుగు పరుచుకునేందుకే పాక్ దర్యాప్తు బృందం ఇక్కడకు వచ్చింది' అంటూ వేసిన ఓ కార్టూన్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనాస్థలిలో పాకిస్థాన్ బృందం విచారణ జరుపుతోంది. ఉగ్రదాడి ఘటనాస్థలి సహా ఇతర ప్రాంతాలను పరిశీలిస్తోంది. అయితే, పఠాన్‌కోట్ ఘటనపై విచారణ చేపట్టేందుకు పాక్ బృందానికి అనుమతినివ్వడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. నిన్న నల్లజెండాలు, బ్యానర్లతో నిరసన ప్రదర్శనలు జరిపాయి. విచారణ బృందంలోని సభ్యుల పేర్లను బ్యానర్లపై రాసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.