: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు!
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపునకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపుపై సౌకర్యాల కమిటీ నివేదికను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎమ్మెల్యేల జీతం రూ.95 వేల నుంచి రూ.1.50 లక్షలకు, ఇంటి అద్దె భత్యం రూ.25 వేల నుంచి 50 వేలకు, పింఛన్ రూ.25 వేల నుంచి 50 వేలకు, కారుకు ఇచ్చే రుణం రూ.10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని, రైల్వే కూపన్ల కింద రూ.లక్ష, పుస్తకాల కొనుగోలు కింద ఐదేళ్లకు గాను రూ.లక్ష ఇవ్వాలని ఆ నివేదికలో ప్రతిపాదించారు.