: బెజవాడలో గవర్నర్... దుర్గామాతను దర్శించుకున్న నరసింహన్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడకు చేరుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యే నిమిత్తం విజయవాడ వచ్చిన కొద్దిసేపటి క్రితం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.