: అన్న కూతురు పెళ్లికి హాజరు కాని పవన్ కల్యాణ్... షూటింగుతో బిజీ!


టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి చిత్తూరుకు చెందిన ఎన్నారై కల్యాణ్ తో ఘనంగా జరిగింది. వధూవరుల కుటుంబాలు, స్వల్ప సంఖ్యలో దగ్గరి బంధుమిత్రులు హాజరైన ఈ పెళ్లి బెంగళూరులోని చిరు ఫాంహౌస్ లో వేడుకగానే జరిగింది. అయితే ఈ పెళ్లికి శ్రీజ బాబాయ్, చిరంజీవి రెండో సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగానే పవన్ కల్యాణ్... తన సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News