: ఆగి ఉన్న ఏసీ కోచ్ లో మంటలు... నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘటన


హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ లోని లోకో షెడ్ లో ఆగి ఉన్న ఓ రైలుకు చెందిన ఓ ఏసీ బోగీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బోగీ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. రైల్వే స్టేషన్ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు మరిన్ని బోగీలకు విస్తరించకుండా నిలువరించగలిగారు. ఆగి ఉన్న బోగీలో ఉన్నపళంగా మంటలు చెలరేగడం అధికారులను విస్మయానికి గురి చేసింది. ప్రమాదానికి గల కారణాలు వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News