: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన హెచ్సీయూ విద్యార్థులు


హెచ్సీయూ వీసీ అప్పారావు ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన విద్యార్థులు, ప్రొఫెసర్లు బెయిల్ పై విడుదలయ్యారు. చర్లపల్లి జైలు నుంచి 25 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లను విడుదల చేసినట్లు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ‘వీసీ అప్పారావును తొలగించే వరకు ఉద్యమం ఆగదు’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కాగా, ఈరోజు ఉదయం నుంచి చర్లపల్లి జైలు వద్ద విద్యార్థులు, ప్రజా సంఘాలు వీరి కోసం ఎదురుచూస్తూ పడిగాపులు కాశారు.

  • Loading...

More Telugu News