: ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య


ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగింది. తన ఇద్దరు స్నేహితులు సుధాకర్, రాంకుమార్ లకు కూడా మద్యంలో పురుగుల మందు కలిపి తాగించాడు. సుధాకర్ చనిపోగా, రాంకుమార్ పరిస్థితి విషమంగా ఉంది. అధికారుల ఆదేశాల మేరకు మద్యం దుకాణంలో శ్రీనివాసులు విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విధులకు సరిగ్గా హాజరుకాని శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు తలెత్తడంతో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి చనిపోయాడు. అయితే, తన మిత్రులకు కూడా ఆ విషం కలిపిన మద్యాన్ని ఎందుకు తాగించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News