: పార్టీ ఫిరాయింపుదారులపై జగన్ సంచలన వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపుదారులపై తొలిసారి పెదవి విప్పిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడినవారంతా పదవులు లేదా డబ్బులు ఆశించిన వారేనని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిన వారికి పదవులకు రాజీనామా చేసే ధైర్యం లేదు, పార్టీలో చేర్చుకున్న వారికి ఈ విషయంలో ప్రజల్లోకి వెళ్లే దమ్ము లేదని ఆయన ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, వ్యక్తిత్వం లేని రాజకీయాలు చేయకూడదని ఆయన చెప్పారు. పార్టీ మారినవారంతా విశ్వసనీయత కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వసనీయత కోల్పోతే కట్టుకున్న భార్య కూడా నమ్మదని ఆయన విమర్శించారు.