: అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భార‌త‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శాస‌న‌స‌భ‌లో ప్రకటించారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. అంబేద్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయ‌న‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని, అంబేద్కర్‌ జయంతి రోజున 6 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎస్సీ కార్పోరేషన్‌లో ఏడాదికి రూ.68కోట్లు ఖర్చు పెట్టింద‌ని, తమ ప్రభుత్వం 460 కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అంబేద్కర్‌ తనకు ఆదర్శమని తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చాలా సందర్భాల్లో చెప్పినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News