: దీదీ హయాంలో బెంగాల్ కు బాంబుల ఫ్యాక్టరీలే వచ్చాయి: అమిత్ షా


పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నప్పటికీ... అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగేశాయి. పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ ఆయా రాష్ట్రాలను చుట్టేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేటి ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ల్యాండయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. తన హయాంలో పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయని మమత చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అమిత్ షా... అలా వచ్చిన ఫ్యాక్టరీలన్నీ బాంబుల ప్యాక్టరీలేనని ఆరోపించారు. ఎన్నికల్లో అటు వామపక్షాలతో గానీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ తో గానీ... అసలు ఎవరితోనూ పొత్తు లేకుండానే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News