: ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి...ముగ్గురు మృతి
ప్రపంచ వ్యాప్తంగా దాడులతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న వేళ.. ఇరాక్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని బాగ్దాద్ నగరంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 27 మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిపై ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.