: వైసీపీకి జ్యోతుల రాజీనామా!... రాజీనామా లేఖకు జగన్ కు పంపిన వైనం


అనుకున్నంతా అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. పార్టీని వీడే వ్యవహారానికి సంబంధించి ఆ పార్టీ కీలక నేత, జగ్గంపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన జ్యోతుల... తన రాజీనామా లేఖను నేరుగా జగన్ కు పంపారు. నిన్న విడతలవారీగా జరిగిన చర్చల్లో జ్యోతులను బుజ్జగించేందుకు వైసీపీ చేసిన యత్నాలు ఏమాత్రం ఫలించలేదు. పార్టీ వీడటం ఖాయమేనని జ్యోతుల...ఆ పార్టీ నేత ప్రసాదరాజుతో తెగేసి చెప్పారు. తనకు గౌరవం లభించని చోట ఉండలేనని కూడా జ్యోతుల ముఖం మీదే చెప్పేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పార్టీకి రాజీనామా చేసిన జ్యోతుల సదరు లేఖను జగన్ కు పంపారు. వైసీపీని వీడిన జ్యోతుల త్వరలోనే ‘సైకిల్’ ఎక్కనున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News