: మిషన్ కాకతీయకు టీ కాంగ్ ఎమ్మెల్సీ మద్దతు...నెల వేతనం విరాళం
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారుకు విపక్షాల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్... రాజకీయాలను పక్కనబెట్టేసి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు మద్దతు పలికారు. అంతేకాకుండా ఈ పథకం నిర్వహణ కోసమంటూ తనవంతు సాయమందించారు. నెల వేతనం రూ.1 లక్షను ఆయన ఆ పథకానికి విరాళంగా అందజేశారు. ఓ వైపు ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, అదే పార్టీకి చెందిన ఫారుక్ హుస్సేన్ మాత్రం నెల వేతనాన్ని విరాళంగా అందజేయడం గమనార్హం.