: సైన్యం రాకుంటే మహిళలు, పిల్లల్ని వదిలేస్తాం: హైజాకర్ల ఆఫర్


కొద్దిసేపటి క్రితం హైజాక్ అయిన ఈజిప్ట్ ఎయిర్ కు చెందిన ఎయిర్ బస్ ఏ 320 (ఎంఎస్ 181)ని సైప్రస్ విమానాశ్రయంలో సాయుధులైన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో విమానం మరోసారి టేకాఫ్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వరాదని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. చుట్టూ ఉన్న సైన్యమంతా వెనక్కు వెళ్లితే, మహిళలు, పిల్లలను విడిచిపెడతామని హైజాకర్ల నుంచి ఆఫర్ రావడంతో చుట్టుముట్టిన భద్రతా దళాలు వెనక్కు మళ్లాయని యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఆండ్రువోలా వసిలియోవ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ విమానంలో 82 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా, అందులో అత్యధికులు ఈజిప్ట్ వాసులేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News