: ఈజిప్ట్‌ విమానాన్ని హైజాక్ చేసిన దుండ‌గులు.. విమానంలో 90మంది ప్ర‌యాణికులు


అలెగ్జాండ్రియా నుంచి కైరో వ‌స్తున్న ఈజిప్ట్‌ విమానాన్ని దుండ‌గులు హైజాక్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాడుల‌తో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్న వేళ‌.. అలెగ్జాండ్రియా నుంచి వ‌స్తోన్న విమానం హైజాక్ కావడం తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తోంది. హైజాక్ చేసిన‌ విమానాన్ని దుండ‌గులు సైప్ర‌స్ వైపు మ‌ళ్లించినట్లు స‌మాచారం. అనంత‌రం అక్క‌డి లార్నాక ఎయిర్ పోర్టులో అది ల్యాండ్ అయిన‌ట్లు తెలుస్తోంది. విమానంలో 90మంది ప్ర‌యాణికులు, ఒక ఆగంతుకుడు ఉన్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News