: తెలంగాణ వ్యాప్తంగా 251 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 190 మంది జీవిత ఖైదీలు సహా ఇతర ఖైదీల విడుదలకు జీవో నంబర్ 38 జారీ అయింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 251 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. చర్లపల్లి జైలు నుంచి 25మంది జీవిత ఖైదీలు, ఇతర శిక్షలు అనుభవిస్తోన్న 28మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఏసీపీ సత్తయ్య హత్యకేసు నిందితుడ్ని కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.