: భానుడి ప్రకోపానికి 45 మంది బలి!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రకోపానికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో తెలంగాణలో 45 మంది ఎండల కారణంగా మరణించినట్టు విపత్తు నిర్వహణా శాఖ నుంచి ప్రభుత్వానికి రిపోర్టు అందింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 18 మంది వడదెబ్బతో మృత్యువాతపడ్డారని, కరీంనగర్ జిల్లాలో 9 మంది, మహబూబ్ నగర్ పరిధిలో ఆరుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో నలుగురు మరణించారని వెల్లడించింది. గత నాలుగు రోజులుగా తెలంగాణలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, తదుపరి రెండు నెలల్లో కొన్ని ప్రాంతాల్లో వేడి 50 డిగ్రీల వరకూ ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా, వరంగల్ లో ఒంటిపూట బడుల సమయాన్ని మరింతగా కుదించాలని 11 గంటలకే స్కూళ్లను వదిలి వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.